Nalgonda: ఆగస్టు 10న 'జైల్ భరో'ను జయప్రదం చేయండి సీఐటీయూ
Nalgonda: కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగస్టు 10న 'జైల్ భరో'. సీఐటీయూ నల్లగొండ మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ కరపత్రాల ఆవిష్కరణ.
Nalgonda: ఆగస్టు 10న 'జైల్ భరో'ను జయప్రదం చేయండి సీఐటీయూ
Nalgonda: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న చేపడుతున్న 'జైల్ భరో'ను జయప్రదం చేయాలని సీఐటీయూ మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏళ్ల పోరాటాల ఫలితంగా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, 4 లేబర్ కోడ్‌లుగా మార్చడం దారుణమన్నారు. పని గంటలను 8 నుంచి 12కు పెంచుతూ, సమ్మె హక్కును హరిస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని, విత్తనాలు, విద్యుత్ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే యత్నాలను అడ్డుకోవాలని కోరారు.
Next Story




