Jawahar Nagar: జవహర్ నగర్‌లో ఘనంగా పౌర హక్కుల దినోత్సవ అవగాహన కార్యక్రమం!
Jawahar Nagar: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ రెవెన్యూ కార్యాలయంలో పౌర హక్కుల దినోత్సవ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Jawahar Nagar: జవహర్ నగర్‌లో ఘనంగా పౌర హక్కుల దినోత్సవ అవగాహన కార్యక్రమం!
Jawahar Nagar: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్, చంద్రపురి కాలనీ డివిజన్లకు సంబంధించి రెవెన్యూ కార్యాలయంలో శనివారం పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కాప్రా తహసీల్దార్ మతిన్ ఆదేశాల మేరకు గిర్దావర్ సత్యనారాయణ స్థానిక ప్రజలకు పౌర హక్కులు, ప్రజా సమస్యల పరిష్కారంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా రెవెన్యూ, పోలీస్ అధికారులతో పాటు మున్సిపల్ సిబ్బంది దృష్టికి తీసుకువస్తే, సంబంధిత శాఖల సమన్వయంతో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారులకు నిర్భయంగా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




