Abdullapurmet: గుంతపల్లిలో రణరంగంగా మారిన గ్రామసభ..సర్పంచ్ భర్త, ఉపసర్పంచ్ ఘర్షణ!

Abdullapurmet: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గుంతపల్లి గ్రామసభలో ఉద్రిక్తత. సర్పంచ్ భర్త, ఉపసర్పంచ్ మధ్య వాగ్వాదం, పరస్పర దాడి. పోలీసుల దర్యాప్తు.

AJAY, HAYATH NAGAR
Published on: 4 Oct 2026 10:38 AM IST
Abdullapurmet
X

Abdullapurmet: గుంతపల్లిలో రణరంగంగా మారిన గ్రామసభ..సర్పంచ్ భర్త, ఉపసర్పంచ్ ఘర్షణ!

Abdullapurmet: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గుంతపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఘర్షణ చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామసభ కొనసాగుతున్న సమయంలో సర్పంచ్ భర్త జంగయ్య, ఉపసర్పంచ్ నర్సింగరావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, అనంతరం ఇరువురూ పరస్పరం దాడి చేసుకున్నట్లు సమాచారం.

గ్రామ సర్పంచ్ హేమలత జంగయ్య మాట్లాడుతూ.. గ్రామసభలో ఉపసర్పంచ్ నర్సింగరావు తన పట్ల అసభ్యంగా మాట్లాడారని, మహిళా సర్పంచ్‌గా తనను గౌరవించకుండా మాట్లాడటంపై తాను అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో తన భర్త జంగయ్యపై ఉపసర్పంచ్ దాడి చేసి, బట్టలు చించారని ఆమె ఆరోపించారు.

మరోవైపు ఉపసర్పంచ్ నర్సింగరావు తనపై సర్పంచ్ భర్త జంగయ్య దాడి చేశారని ఆరోపిస్తూ అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR