Maheshwaram: పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండ: కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
Maheshwaram: మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
Maheshwaram: పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండ: కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
మహేశ్వరం: అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కొండంత అండగా నిలుస్తోందని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (KLR) అన్నారు. శుక్రవారం తుక్కుగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా KLR మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చులు భారంగా మారకుండా ప్రజా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.




