Vikarabad: రేవంత్ రెడ్డి హోం మంత్రిగా అట్టర్ ఫ్లాప్ మెతుకు ఆనంద్

Vikarabad: రంగారెడ్డి జిల్లా షాబాద్ ఘటనపై మెతుకు ఆనంద్ తీవ్ర ఆగ్రహం. పరిపాలనను గాలికి వదిలేసి కాలక్షేప కార్యక్రమాల్లో సీఎం నిమగ్నమయ్యారని విమర్శలు.

MOGULAIAH, VIKARABAD
Published on: 11 July 2026 3:26 PM IST
Vikarabad
X

Vikarabad: రేవంత్ రెడ్డి హోం మంత్రిగా అట్టర్ ఫ్లాప్ మెతుకు ఆనంద్

వికారాబాద్: రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలంలో జరిగిన ఘటన హృదయాన్ని కలచివేసింది. తెలంగాణ రాష్ట్రంలో మర్డర్లు, మానభంగాలు, పట్టపగలే దొంగతనాలు షరా మామూలు అయిపోయాయి. పోలీసు వాళ్లను.. తమ కాంగ్రెస్ ఏజెంట్లుగా రేవంత్ రెడ్డి వాడుకోవడం వల్లే వారు లా అండ్ ఆర్డర్ ను మెయింటైన్ చేయలేకపోతున్నారు. దాని ఫలితమే ఇలాంటి దారుణాలు.

తెలంగాణలో రైతుల ఆదాయం తగ్గింది, ప్రజల ఆరోగ్యం దెబ్బతింది, నిరుద్యోగులకు ఉద్యోగాలు తగ్గాయి... కానీ క్రైమ్ రేటు మాత్రం చాలా అద్భుతంగా పెరిగింది. హోం శాఖ మంత్రిగా కొనసాగే నైతిక హక్కు రేవంత్ రెడ్డి గారికి లేదు. పరిపాలనను గాలికి వదిలేసి, కాలక్షేప కార్యక్రమాలు (పూరీలు వేయించడం, బాస్కెట్బాల్ ఆడటం, మ్యాచ్ అర్ధరాత్రి వరకు చూడటం, అందాల పోటీలు నిర్వహించడం) చేస్తున్నాడు రేవంత్ రెడ్డి.

ఇంతటి ఘోరమైన ఘటనను చూసి చెలించిన బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తదితరులు.. పరామర్శించడానికి పోతుంటే వారిని అడ్డుకోవడం దారుణం. ఇలాంటి కార్యక్రమాలు పోలీసుల చేత చేయించటం వల్లనే వారి విధులను పోలీసులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు.

రేవంత్ రెడ్డి గారు హోంశాఖ మంత్రిగా అట్టర్ ఫ్లాప్, విద్యాశాఖ మంత్రిగా అట్టర్ ఫ్లాప్, మున్సిపల్ శాఖ మంత్రిగా అట్టర్ ప్లాప్, ముఖ్యమంత్రిగా అట్టర్ ప్లాప్ అట్టర్ ఫ్లాప్.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story