Kodangal: సీఎం పర్యటనతో కొడంగల్ హై అలర్ట్ ఎస్పీ కలెక్టర్ భద్రతా తనిఖీలు

Kodangal: కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల, హకీంపేట్ గ్రామాల్లో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కలెక్టర్ దీపక్ తివారి భద్రతను సమీక్షించారు.

AKRAM PASHA , KODANGAL
Published on: 20 July 2026 8:45 PM IST
Kodangal
X

Kodangal: సీఎం పర్యటనతో కొడంగల్ హై అలర్ట్ ఎస్పీ కలెక్టర్ భద్రతా తనిఖీలు

కొడంగల్: వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో దుద్యాల, హకీంపేట్ గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రేపు 21/07/26 నాడు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కొనసాగుతున్న ఇంటిగ్రెటెడ్ ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్ పి స్నేహ మెహరతో కలిసి జిల్లా కలెక్టర్ దీపక్ తివారి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.

హెలిప్యాడ్, ఇంటిగ్రెటెడ్ ఎడ్యుకేషన్ హబ్ , ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మొత్తం 9 బ్లాక్ లలో బారికేడ్లు, పూర్తి స్థాయి లో ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.

AKRAM PASHA , KODANGAL

AKRAM PASHA , KODANGAL

Next Story