Shabad: షాబాద్ మండల రైతు వేదికల్లో సీఎం రేవంత్ రెడ్డి లైవ్ ప్రసారం!

Shabad: షాబాద్ మండలంలోని రైతు వేదికలలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి లైవ్ ప్రసారం. ఎల్‌నినో ప్రభావం, సాగు మెళకువలపై రైతులకు అవగాహన సదస్సు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 11 Oct 2026 12:32 PM IST
Shabad
X

Shabad: షాబాద్ మండల రైతు వేదికల్లో సీఎం రేవంత్ రెడ్డి లైవ్ ప్రసారం!

Shabad: ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ యాసంగి సీజన్లో రైతులకు అవగాహన కల్పించేందుకు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.

కార్యక్రమ వివరాలు

తేదీ: సోమవారం, 12-10-2026

సమయం: ఉదయం 10:30 గంటలకు

కార్యక్రమం: మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రత్యక్ష ప్రసారం

వేదికలు: షాబాద్ మండలంలోని ఈ రైతు వేదికలు ద్వారా

షాబాద్ రైతు వేదిక, మాచనపల్లి రైతు వేదిక, తాళ్ళపల్లి రైతు వేదిక

ముఖ్యఅతిథులు గౌరవ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ శ్రీ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి గారు, అతిథులు; గౌరవ సర్దార్ నగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీ పీసరి సురేందర్ రెడ్డి గారు, గౌరవ గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ ఛైర్మన్ శ్రీ కావలి చంద్రశేఖర్ గారు,

గౌరవ షాబాద్ సర్పంచ్ శ్రీ అశోక్ గారు, షాబాద్ మండలంలోని గౌరవ సర్పంచు గార్లు, గౌరవ ప్రజాప్రతినిధులు, వ్యవసాయ సహకార సంఘం చైర్మన్, వైస్ ఛైర్మన్, డైరెక్టర్లు, సి.ఇ.ఓ, స్టాఫ్, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ (సి.ఇ.ఓ), డైరెక్టర్లు, సభ్యులు, ఎరువులు, పురుగుమందుల, మరియు విత్తన డీలర్లు వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామస్థాయి, ప్రజాప్రతినిధులు, రైతు సోదరులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, మరియు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమకు సమీపంలోని రైతు వేదికలకు పెద్ద సంఖ్యలో హాజరై మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి.

ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం లోటు, వర్షాల అసమాన పంపిణీ మరియు మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంపై పడే ప్రభావాలను దృష్టిలో ఉంచుకొని, రైతులకు అవసరమైన అవగాహన కల్పించడం, పంటల సాగులో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, నీటి వనరుల సమర్థ వినియోగం, పంటల ఎంపిక, ప్రత్యామ్నాయ సాగు విధానాలు మరియు వ్యవసాయానికి సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలపై మార్గదర్శకత్వం అందించేందుకు మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు గారి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం నిర్వహించబడుతోంది.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA