Medchal: ఘట్‌కేసర్ వందన హోటల్‌లో పన్నీర్ బిర్యానీలో బొద్దింకలు కలకలం!

Medchal: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని వందన హోటల్‌లో పన్నీర్ బిర్యానీలో బొద్దింకలు కలకలం. తిని అస్వస్థతకు గురైన కుటుంబం, పోలీసులకు బాధితుల ఫిర్యాదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Sept 2026 1:16 PM IST
Medchal
X

Medchal: ఘట్‌కేసర్ వందన హోటల్‌లో పన్నీర్ బిర్యానీలో బొద్దింకలు కలకలం!

Medchal: హోటల్‌లో పన్నీర్‌ బిర్యానీ తిన్న ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లోని వందన హోటల్‌లో కుటుంబ సభ్యులు పన్నీర్‌ బిర్యానీ ఆర్డర్‌ చేసి తిన్నారు. అయితే బిర్యానీలో బొద్దింకలు కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆహారం తిన్న కొద్దిసేపటికే కుటుంబ సభ్యులకు వాంతులు కావడంతో చికిత్స కోసం స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినట్లు బాధితులు తెలిపారు.

బిర్యానీలో బొద్దింకలు కనిపించిన విషయాన్ని హోటల్‌ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా.. సిబ్బంది తమతో దురుసుగా మాట్లాడినట్లు బాధితులు తెలిపారు. మీకు తోచింది చేసుకోండి అంటూ యాజమాన్యం సిబ్బంది సమాధానం ఇచ్చినట్లు వివరించారు. బాధితుడు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హోటల్‌లో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను సంబంధిత అధికారులు పరిశీలించాలని బాధితులు కోరుతున్నారు. వందన హోటల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్