Hyderabad: టీహబ్‌లో కాగ్నిచాంప్ స్కాలర్షిప్ కార్యక్రమం
Hyderabad: కాగ్నిచాంప్ ఇండియా స్కాలర్షిప్-తెలంగాణ 2026 కార్యక్రమంలో టాప్ 100 విద్యార్థులు పాల్గొన్నారు.
Hyderabad
Hyderabad: తెలంగాణలో విద్యా రంగానికి కొత్త దిశను సూచిస్తూ లక్షకు పైగా విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్వహించిన కాగ్నిచాంప్ ఇండియా స్కాలర్షిప్-తెలంగాణ 2026 కార్యక్రమం టీహబ్లో నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన టాప్ 100 మేధావులు, వారి తల్లిదండ్రులు, విద్యావేత్తలు, పాఠశాలల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జయప్రకాష్ నారాయణతో పాటు కాగ్నిటివ్ స్కోర్ ఏఊఫౌండర్స్ కీర్తి కుమారైజైన్, విక్రమ్సంగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఇప్పటికే టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్లో దేశానికి నాయకత్వం వహిస్తోందన్నారు. ఇప్పుడు కాగ్నిటివ్ రెడీనెస్ కూడా ముందుండాలని, ప్రపంచ స్థాయి సంస్థలు భవిష్యత్లో ఉద్యోగులను ఎంపిక చేసేటప్పుడు మార్కుల కంటే సమస్యల పరిష్కారంలో ఎలా ఆలోచిస్తారు, ఎలా పరిష్క రిస్తారు అనే అంశాలను ఎక్కువగా పరిశీలిస్తాయన్నారు.




