Vikarabad: వికారాబాద్ ప్రతిరోజూ 100 ఓటర్ల వివరాలు నమోదు చేయాలి
Vikarabad: వికారాబాద్‌లో ఓటర్ల జాబితా సవరణపై కలెక్టర్ దీపక్ తివారి సమీక్ష. రోజుకు 100 మంది వివరాలు డిజిటలైజ్ చేయాలని బిఎల్ఓలకు ఆదేశం.
Vikarabad: వికారాబాద్ ప్రతిరోజూ 100 ఓటర్ల వివరాలు నమోదు చేయాలి
వికారాబాద్: రోజుకు 100 ఓటర్ల వివరాలను డిజిటలైజేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి బిఎల్ఓ లను ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆలంపల్లి, కొత్త గడి వార్డులలో ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఏ ఒక్కరూ ఓటు హక్కును కోల్పోకుండా ప్రతి ఇంటి నుండి ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకొని డిజిటలైజేషన్ చేయాలని బిఎల్ఓ లకు కలెక్టర్ సూచించారు.
శని, ఆదివారాలలో ప్రభుత్వ సెలవు ఉన్నందున తప్పనిసరిగా ఎస్ఐఆర్ ను చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. వార్డులలో విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారం తీసుకొని ఎస్ఐఆర్ ను వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) సచిన్ బస్వరాజ్ గుట్టూరు, డిఆర్ఓ స్వర్ణలత, తహసిల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి లు ఉన్నారు.




