Medchal: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి కలెక్టర్ అల్పాహారం!

Medchal: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కౌకూర్ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ మనుచౌదరి సందర్శించారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన ఆయన

PURENDAR, ALWAL
Published on: 9 July 2026 4:42 PM IST
Medchal
X

Medchal: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి కలెక్టర్ అల్పాహారం!

మేడ్చల్: మల్కాజ్ గిరి జిల్లాలోని కౌకూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ మనుచౌదరి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఉదయం పూట విద్యార్థులకు అల్పాహారం, పాఠశాలలో మౌలిక వసతులను కలెక్టర్ పరిశీలించారు.

జిల్లాలో అన్ని పాఠశాలలకు ఒకే చోట అల్పాహారం తయారు చేసి అందించాలనే సంకల్పంతో పూడూరులో స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని వసతి గృహాలలో కామన్ మెనూ అమలుకు ఆదేశాలివ్వడం జరిగిందన్నారు.

విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు. జిల్లా లో కోర్ అర్బన్ రీజియన్ లో ఇంకా ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు అవసరం ఉందో అక్కడ స్కూల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రేణుక దేవి, మండల విద్యాధికారి మురళి కృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL

Next Story