Vikarabad: ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచొద్దు.. కలెక్టర్ హెచ్చరిక

Vikarabad: జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ తివారి 151 ప్రజా సమస్యల అర్జీలను స్వీకరించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 18 May 2026 9:24 PM IST
Vikarabad
X

Vikarabad: ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచొద్దు.. కలెక్టర్ హెచ్చరిక

Vikarabad: జిల్లా లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరి గా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. సోమవారము కల్లెక్ట్రేట్ కార్యాలయ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన “ప్రజావాణి” కార్యక్రమంలో అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

ప్రజావాణి ద్వార వచ్చిన దరఖాస్తు లను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలు విన్నవిస్తూ దరఖాస్తు లు సమర్పించా రని కలెక్టర్ తెలిపారు. ఆర్ డి ఓ మరియు తహసిల్దార్ ల పరిదిలో స్వీకరించిన దరకాస్తులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని , ప్రతి ఫిర్యాదు పై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాశించారు.

ముఖ్యంగా భూసంబంధిత సమస్యలు, ఆసరా పెన్షన్లు , రేషన్ కార్డులు, గృహనిర్మాణము, వ్యవసాయం,ఉపాధి, జిల్లా పంచాయతి, భూ సర్వే వివిధ అంశాలపై వచ్చిన దరఖాస్తు లపై దృష్టి పెట్టాలన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా 151 దరఖాస్తులు వచ్చాయని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వేగంగా పరిష్కరించెందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ వెంకటాచారి,అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్. జడ్ పి సి ఇ ఓ సుధీర్, వివిధ శాఖ ల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story