Telangana: సెలవు రోజుల్లోనూ 41 బార్లకు దరఖాస్తుల స్వీకరణ!
Telangana: దరఖాస్తుదారుల రద్దీ దృష్ట్యా అక్టోబర్ 10 రెండో శనివారం, 11 ఆదివారం సెలవు రోజుల్లోనూ 41 బార్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ తెలిపారు.
Telangana: సెలవు రోజుల్లోనూ 41 బార్లకు దరఖాస్తుల స్వీకరణ!
తెలంగాణ: రెండు రోజుల సెలవుల్లో కూడ దరఖాస్తులు తీసుకోవాలని దరఖాస్తుదారుల నుంచి విజ్ఞప్తులు రావడం, రెండు రోజుల సెలవు రోజుల్లో దరఖాస్తులు తీసుకుంటే బాగుంటుందని డిప్యూటి కమిషనర్ల నుంచి కూడ రిక్వెస్ట్లు రావడంతో శని, ఆదివారాల్లో దరఖాస్తులు తీసుకోవడానికి ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ తెలిపారు.
ఈ నెల 10న రెండో శనివారం, 11న ఆదివారం రోజున ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బార్లకు దరఖాస్తులు తీసుకుంటారని కమిషనర్ తెలిపారు. 9,11,12 తేదీలు మంచి రోజులు కావడంతో వచ్చె దరఖాస్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక కౌంటర్లను అన్ని చోట్ల ఏర్పాటు చేయాలని డీసీలకు, అధికారులకు కమిషనర్ అదేశాలు జారీ చేశారు. క్యూర్ పరిధిలోని 14 బార్లతో పాటు మిగిలిన 27 బార్లకు ప్రస్తుతం తీసుకుంటున్న రీతిలో సెలవు రెండు రోజుల్లో కూడ దరఖాస్తులు స్వీకరిస్తామని కమిషనర్ పేర్కొన్నారు.




