Hyderabad: 60 మంది ఈవ్‌టీజర్లను పట్టిన పోలీసులు
Hyderabad: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈవ్‌టీజర్లకు సంస్కార్ మెగా కౌన్సిలింగ్.
Hyderabad: 60 మంది ఈవ్‌టీజర్లను పట్టిన పోలీసులు
హైదరాబాద్: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలను వేధిస్తున్న పోకిరీలకు నాగోల్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో సీపీ సుమతి ఆధ్వర్యంలో సంస్కార్ మెగా కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనర్. సుమతి మాట్లాడుతూ.. "2026 జనవరి నుంచి మే వరకు షీ టీమ్స్‌కు 760 మంది ఈవ్‌టీజర్లు పట్టుబడ్డారు. మహిళలను వేధించిన కేసుల్లో 61 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 231 పెట్టీ కేసులు చేశాం" అని తెలిపారు.
"మహిళలను వేధిస్తున్న వారిలో 180 మంది మైనర్లు, 24 ఏళ్లలోపు యువకులు, 50 ఏళ్ల వయసు వారు కూడా ఉండటం బాధాకరం" అని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు.
కఠిన హెచ్చరిక: "శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే ఎలాంటి శక్తులనైనా సహించేది లేదు. ముఖ్యంగా మహిళలు, పిల్లల రక్షణ కోసం ప్రత్యేక విభాగాలు నిరంతరం నిఘా ఉంచుతాయి" అని సీపీ హెచ్చరించారు.
రాత్రి వేళల్లో గస్తీని మరింత ముమ్మరం చేశామని, కాలనీల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహిస్తూ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.




