Keesara: కీసర సర్కిల్‌లో కాంగ్రెస్ మాజీ ప్రజాప్రతినిధి అక్రమ నిర్మాణం

Keesara: కీసర సర్కిల్ మోహన్ రావు కాలనీలో దీపావళి సెలవులను ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ మాజీ ప్రజాప్రతినిధి చేపట్టిన అక్రమ నిర్మాణంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

PURENDAR, ALWAL
Published on: 8 Nov 2026 4:49 PM IST
Keesara
X

Keesara: కీసర సర్కిల్‌లో కాంగ్రెస్ మాజీ ప్రజాప్రతినిధి అక్రమ నిర్మాణం

మల్కాజ్గిరి: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కీసర సర్కిల్ చంద్రపురి కాలనీ డివిజన్ పరిధిలో మోహన్ రావు కాలనీలో దీపావళి పండగ సెలవు దినం రోజులలో కాంగ్రెస్ పార్టీ ఓ మాజీ ప్రజా ప్రతినిధి అక్రమ నిర్మాణం చేపడుతున్నారు సెలవు దినం కావడంతో ఇదే అదునుగా భావించి పట్ట పగలు నిర్మాణం చేపడుతున్నారు.

దీనిపై రెవెన్యూ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. సామాన్య ప్రజలు కూలీ నాలి చేసుకొని చిన్న గుడిసె వేసుకుంటే ఆగ మేఘాల మీద జెసిబి సహాయంతో కూల్చివేసే రెవెన్యూ అధికారులు ఈ మాజీ ప్రజా ప్రతినిధి అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేస్తారా లేదా వేచి చూడాలి.

మరియు దీనిపై అధికారులు ఏ విధమైన చర్యలు చేపడతారో సామాన్యులకు చట్టం వర్తిస్తుంది మాజీ ప్రజాప్రతినిధులకు చట్టం వర్తించద. ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని చెప్పే రెవెన్యూ అధికారులు దీనిపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL