Ghatkesar: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఆత్మగౌరవ పోరు!

Ghatkesar: శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఘట్‌కేసర్‌ సర్కిల్‌ చౌదరిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ నిరసన ర్యాలీ నిర్వహించారు.

KARUNAKAR, UPPAL
Published on: 10 Sept 2026 10:16 PM IST
Ghatkesar
X

Ghatkesar: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఆత్మగౌరవ పోరు!

ఘట్‌కేసర్‌: శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా, ఘట్‌కేసర్‌ సర్కిల్‌ పరిధిలోని పోచారం డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కర్రె రాజేష్‌ ఆధ్వర్యంలో గురువారం చౌదరిగూడలో ఆత్మగౌరవ నిరసన చేపట్టారు.

ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్‌ మల్లిపెద్ది శరత్‌చంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాంగ్రెస్‌ శ్రేణులు డప్పుల మోతతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, తాతా మధు, నవీన్‌రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు.

అంబేడ్కర్‌, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనన్నారు. స్పీకర్‌ పదవి గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్‌ శ్రేణులు ఐక్యంగా పోరాడుతాయని కర్రె రాజేష్‌ తెలిపారు. కార్యక్రమంలో ఘట్ కేసర్ డివిజన్ అధ్యక్షులు బొక్కా ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు సామల అమరేందర్‌, కర్రే జంగమ్మ,, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పాలడుగు అమరేందర్‌రెడ్డి, బద్దం నర్సింహరెడ్డి, బద్దం కుమార్‌, గండ్రపు నరేష్‌, నీరుడి కుమార్‌, బానోత్‌ శ్రవణ్‌నాయక్‌, ముద్దం ఈశ్వర్‌యాదవ్‌, సయ్యద్‌ జాఫర్‌, యుగేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story