Kukatpally: ఎమ్మెల్సీ మధుపై చర్యలు తీసుకోవాలి: చిరుమర్తి రాజు

Kukatpally: స్పీకర్‌పై వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై కూకట్‌పల్లి ఏసీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత చిరుమర్తి రాజు. ఎస్సీ, ఎస్టీ కేసుకు డిమాండ్.

Maruthisagar, Kukatpally
Published on: 7 Sept 2026 7:16 PM IST
Kukatpally
X

Kukatpally: ఎమ్మెల్సీ మధుపై చర్యలు తీసుకోవాలి: చిరుమర్తి రాజు

కూకట్‌పల్లి: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మధుసూదన్‌పై కూకట్‌పల్లి ఏసీపీకి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర నాయకులు చిరుమర్తి రాజు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై మధుసూదన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

మధుసూదన్‌ను ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చిరుమర్తి రాజు డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో పాటు యావత్ దళిత సమాజానికి మధుసూదన్ క్షమాపణలు చెప్పాలని కోరారు. క్షమాపణ చెప్పకపోతే మధుసూదన్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story