Talakondapally: రంగయ్య కుటుంబానికి పరామర్శ ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ నాయకులు!
Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో అనారోగ్యంతో మృతిచెందిన మాజీ సర్పంచ్ కుమారుడి కుటుంబానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు.
Talakondapally: రంగయ్య కుటుంబానికి పరామర్శ ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ నాయకులు!
Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ కుమారుడు చలచిమల చంద్రయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు ఇట్టి విషయాన్ని తలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ రంగయ్య కుమారుడు మృతి పట్ల సంతాపం తెలుపుతూ వారి కుటుంబానికి 4000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
కాంగ్రెస్ పార్టీకి రంగయ్య తన జీవితాన్ని అర్పించాడని వారి కుటుంబానికి ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్ ఏఎంసి డైరెక్టర్ అజీమ్, మీసేవ మల్లేష్, పోతుగంటి గణేష్, బోల యాదగిరి, అశ్వ యాదయ్య, పురుషోత్తం, పోతుగంటి సురేష్, కట్టుక వెంకటయ్య, కిరణ్, పెరమాండ్ల శ్రీశైలం, జూలపల్లి ఆంజనేయులు, సుదర్శన్, పెరుమాండ్ల భాస్కర్, పోతుగంటి కృష్ణ, శ్రీను, శేఖర్, పోతుగంటి శ్రీను, కట్టు మల్ల సాయి, తదితరులు పాల్గొన్నారు.




