LB Nagar: ఎల్బీనగర్ ఎమ్మెల్యే డబుల్ బెడ్‌రూమ్ దందా: ప్రవీణ్ రెడ్డి!

LB Nagar: గత ప్రభుత్వంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భారీ అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేత ప్రవీణ్ రెడ్డి ఆరోపించారు

RAHUL, MEERPET
Published on: 24 Oct 2026 5:13 PM IST
LB Nagar
X

LB Nagar: ఎల్బీనగర్ ఎమ్మెల్యే డబుల్ బెడ్‌రూమ్ దందా: ప్రవీణ్ రెడ్డి!

LB Nagar: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మంత్రులపై డబల్ బెడ్ రూమ్ స్కాం అంటూ ఆరోపణలు చేస్తున్న బీ ఆర్ ఎస్ పార్టీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి గత ప్రభుత్వంలో చేసిన డబుల్ బెడ్ రూమ్ దందా మరిచిపోయి గురివింద మాటలు మాట్లాడుతూ రీల్స్ కోసం ఫోజులు కొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్ రెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్ రెడ్డి లింగోజి గూడ లోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుదీర్ రెడ్డి తన ఇంట్లో పనిమనుషులకు,ఫార్మ్ హౌస్ వర్కర్స్,డ్రైవర్ల పేరుతో డబల్ బెడ్ రూమ్ లు అమ్ముకున్న పట్టాల ఆధారాలతో సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావని, ఆయన దందాలు దుర్మార్గాలు ఆయన వెంట వుండే కార్యకర్తలే బయట పెడుతున్నరని వెల్లడించారు.

డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదలకు అందాల్సిన చోట ఎమ్మెల్యే లెటర్ హెడ్ తో అధికారులకు బెదిరింపులు చేసి ఎల్బీనగర్ నాంచారమ్మ బస్తీ, వనస్థలిపురం సాహెబ్ నగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో తన ఇంట్లో,ఫార్మ్ హౌస్లో,స్నేహితుల ఇంట్లో పనిచేసే పనోళ్లకు,పీఏలకు, ఫోటో గ్రాఫర్లకు, ఫార్మ్ హౌస్ అమ్మిన యజమానులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇప్పించి అమ్ముకున్న చరిత్ర సుదీర్ రెడ్డిదేనని ప్రవీణ్ రెడ్డి ఆరోపించారు.

దొంగే దొంగ అంటూ సుదీర్ రెడ్డి శ్రీరంగ నీతులు వల్లివేస్తున్నారని, ఈ రోజు మీడియా ముందు ఉంచిన ఆదారాలలో ఎలాంటి అబద్ధాలు ఉంటే ఎమ్మెల్యే నిరూపించాలి,లేకుంటే అవి నిజమని ఒప్పుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులపై అవాస్థవాలు ఆరోపించాలనుకుంటే ఆకాశం మీద ఉమ్మినట్టేనని ఎద్దేవా చేశారు.

బైట్: ప్రవీణ్ రెడ్డి - కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి.

RAHUL, MEERPET

RAHUL, MEERPET