Amangal: మార్కెట్ కమిటీ చైర్మన్‌గా డోకూరి ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలి!
Amangal: ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని సీనియర్ కాంగ్రెస్ నేత డోకూరి ప్రభాకర్ రెడ్డికి కేటాయించాలని వెల్జాల్ మాజీ ఉపసర్పంచ్ అజీజ్ ఎమ్మెల్యే కసిరెడ్డిని కోరారు.
Amangal: మార్కెట్ కమిటీ చైర్మన్‌గా డోకూరి ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలి!
Amangal: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు డోకూరి ప్రభాకర్ రెడ్డికి కేటాయించాలని వెల్జాల్ గ్రామ మాజీ ఉపసర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు ఎం.ఏ. అజీజ్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కోరారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ, కార్యకర్తలకు అండగా నిలిచిన డోకూరి ప్రభాకర్ రెడ్డి సేవలను గుర్తించాలని కోరారు. ఆయనకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కల్పిస్తే పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నిండుతుందని అజీజ్ పేర్కొన్నారు.




