Medchal: మల్కాజిగిరి జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే ధ్యేయం!
Medchal: మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని జీఎన్ఆర్ కన్వెన్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం బుధవారం ఘనంగా జరిగింది.
Medchal: మల్కాజిగిరి జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే ధ్యేయం!
మేడ్చల్: నియోజకవర్గంలోని మేడ్చల్ డివిజన్ పరిధిలోని జి ఎన్ ఆర్ కన్వెన్షన్ హల్ లో మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్,పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయ 8రామారావు గారు,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ తోటకూర వజ్రేష్ (జంగయ్య) యాదవ్ గారు,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు,టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి శ్రీ సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి గారు,మేడ్చల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ మలిపెద్థి సుధీర్ రెడ్డి గారు,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రా రెడ్డి గారు,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ నక్క ప్రభాకర్ గౌడ్ గారు విచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పార్టీ బలోపేతం కృషి చేయాలని తెలియజేసారు.
ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ గారు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని,ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ 297 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నడికొప్పు నాగరాజు (చాపరాజు)ముదిరాజ్,298 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్,299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గర్శాల సురేందర్ ముదిరాజ్,మేడ్చల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు చీర్ల రమేష్ కురుమ,జాకట దేవరాజ్,కౌడే మహేష్ కురుమ,పెంజర్ల స్వామి యాదవ్,వీరమల్ల శ్రావణ్ కుమార్ గుప్తా,బత్తుల మధుకర్ యాదవ్,నారెడ్డి రవీందర్ రెడ్డి,సాటే నరేందర్ వంజరి,మేడ్చల్ సొసైటీ డైరెక్టర్ వెంకట్ రాంరెడ్డి,మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉదండపతదితరులు పాల్గొన్నారు.




