LB Nagar: ర్మన్‌ఘాట్ చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం!
LB Nagar: హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది.
LB Nagar: ర్మన్‌ఘాట్ చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం!
ఎల్బీనగర్: నీట్ పరీక్ష అవకతవకలపై ఢిల్లీలో నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని నిరసిస్తూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కర్మన్‌ఘాట్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. నీట్ అవకతవకలను ప్రశ్నించిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జీ చేసిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని రాజశేఖర్‌రెడ్డి కోరారు.
Next Story




