Serilingampally: స్పీకర్ ప్రసాద్ కుమార్ తల్లిపై వ్యాఖ్యలు: చందానగర్‌లో కాంగ్రెస్ నిరసన!
Serilingampally: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తల్లిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను నిరసిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చందానగర్‌లో ధర్నా చేపట్టారు.
Serilingampally: స్పీకర్ ప్రసాద్ కుమార్ తల్లిపై వ్యాఖ్యలు: చందానగర్‌లో కాంగ్రెస్ నిరసన!
శేరిలింగంపల్లి: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తల్లిపై "బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు" చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా "రంగారెడ్డి జిల్లా సెక్రటరీ" కట్ల శేఖర్ రెడ్డి గారి అధ్యక్షతన మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో "శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి" వి. జగదీశ్వర్ గౌడ్ నాయకత్వంలో చందానగర్ డివిజన్ పరిధిలోని "డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం" వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో "ఉమ్మడి ఆల్విన్ కాలనీ 124 డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు" పట్వారీ శశిధర్ పాల్గొని తమ మద్దతుగా నిరసన తెలిపారు..
ఈ సందర్బంగా వి.జగదీశ్వర్ గౌడ్ గారు మాట్లాడుతూ రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను, ముఖ్యంగా తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం తగదని తీవ్రంగా ఖండిస్తునానని , ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాము అని ఆయన తెలిపారు.
బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజస్వామ్యని,దళితులన్న గౌరవం లేదని వారికి ఇష్టానుసారంగా ఎవరిని పడితే వారిని దూషించడం, శాసనసభ స్పీకర్ అనే మర్యాద కూడా లేకపోవడం సరి కాదని, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇకపైన్న అయినా తీరు మారకపోతే వారికి తగిన బుద్ధి చెబుతామని, వెంటనే స్పీకర్ గారికి క్షమాపణ చెప్పాలని ఆయన హెచ్చరించారు.వెంటనే వారిని అరెస్ట్ చేయాలనీ చందానగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఫిర్యాదు చేసి,తమ నిరసన వ్యక్తం చేశారు..
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్‌చార్జులు, మహిళా కాంగ్రెస్ నాయకులు , యూత్ కాంగ్రెస్, NSUI, సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




