Pargi: పరిగిలో వినాయక నిమజ్జన ఊరేగింపులో తీవ్ర ఉద్రిక్తత!
Pargi: వికారాబాద్ జిల్లా పరిగిలో వినాయక నిమజ్జన ఊరేగింపులో ఉద్రిక్తత. గొడవను ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన యువకుడు, తీవ్ర గాయాలు.
Pargi: పరిగిలో వినాయక నిమజ్జన ఊరేగింపులో తీవ్ర ఉద్రిక్తత!
PARGI: వికారాబాద్ జిల్లా పరిగిలో వినాయక నిమజ్జన ఊరేగింపులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు గ్రూపుల మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌పై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.పరిగిలో వినాయక నిమజ్జన ఊరేగింపు కొనసాగుతున్న సమయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది.
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కానిస్టేబుల్ నర్సింహులు అక్కడికి వెళ్లారు.అయితే అప్పటికే కత్తితో ఉన్న ఓ యువకుడు గొడవను ఆపేందుకు వచ్చిన కానిస్టేబుల్ నర్సింహులుపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది.ఈ దాడిలో కానిస్టేబుల్ ఛాతీ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే తోటి సిబ్బంది నర్సింహులును పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రక్తస్రావం ఆగకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన యువకుడిని తరుణ్‌గా గుర్తించినట్లు తెలిపారు.తరుణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.వినాయక నిమజ్జన వేడుకల్లో చోటుచేసుకున్న ఈ ఘటనతో పరిగిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.




