Vanasthalipuram: వనస్థలిపురంలో నిర్మాణ పనులు చేస్తూ కూలీ కుప్పకూలి మృతి!

Vanasthalipuram: వనస్థలిపురం గాయత్రినగర్‌లో భవన నిర్మాణ పనులు చేస్తూ కూలీ వీరేష్ (47) కుప్పకూలి మృతి. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత.. పోలీసుల కేసు నమోదు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 17 Sept 2026 11:07 PM IST
Vanasthalipuram
X

Vanasthalipuram: వనస్థలిపురంలో నిర్మాణ పనులు చేస్తూ కూలీ కుప్పకూలి మృతి!

వనస్థలిపురం: నిర్మాణ పనులు చేస్తుండగా ఓ కూలీ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాహెబ్‌నగర్‌ గాయత్రినగర్‌కు చెందిన వీరేష్‌ (47), కూలీగా పనిచేస్తున్నాడు.

సెప్టెంబర్‌ 15న మధ్యాహ్నం సుమారు 3.20 గంటల సమయంలో గాయత్రినగర్‌ బ్యాంక్‌ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న భవనంలో పని చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతడిని వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 7.14 గంటలకు వీరేష్‌ మృతి చెందాడు.

మృతుడి భార్య ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR