Abdullapurmet: రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలి: ముత్యాల యాదిరెడ్డి!

Abdullapurmet: భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ దాని స్ఫూర్తిని కొనసాగించాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ముత్యాల యాదిరెడ్డి గురువారం అన్నారు.

AJAY, HAYATH NAGAR
Published on: 26 Nov 2026 8:10 PM IST
Abdullapurmet
X

Abdullapurmet: రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలి: ముత్యాల యాదిరెడ్డి!

అబ్దుల్లాపూర్‌మెట్: భారత స్వాతంత్ర్యం, గణతంత్ర వ్యవస్థకు రాజ్యాంగమే పునాది అని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ దాని స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి అన్నారు.

నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సీపీఐ అబ్దుల్లాపూర్‌మెట్ మండల సమితి ఆధ్వర్యంలో మండల కార్యదర్శి కామ్రేడ్ అజ్మీర హరిసింగ్ నాయక్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముత్యాల యాదిరెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఆ పార్టీ ఆశించిన సంఖ్య సాధ్యం కాలేదని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి బదులుగా మనుస్మృతి ఆధారిత విధానాలను అమలు చేయాలనే లక్ష్యం బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు ఉందంటూ ఆయన విమర్శించారు. కుల, మత, లింగ వివక్షలకు తావులేకుండా రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

స్వచ్ఛంద సంస్థలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా నేటికీ అనేకమంది పేదలకు ఇల్లు, తిండి, దుస్తులు వంటి కనీస అవసరాలు అందని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు, కర్షకులు, దళితులు, ఆదివాసీలు, బహుజనులు, మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ అబ్దుల్లాపూర్‌మెట్ మండల సహాయ కార్యదర్శి కేతరాజు నరసింహ, ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దాసరి ప్రసాద్, మహిళా సమాఖ్య నాయకురాలు సీహెచ్. సుజాత, అలివేలు, వీణ, సువర్ణ, ఏఐవైఎఫ్ నాయకులు నిమ్మల గణేష్, శోభన్ బాబు, శాఖ కార్యదర్శులు బోయ కిషోర్, లాలప్ప, ఆంజనేయులు, రవి, నరసింహ, ప్రవీణ్, శంకర్ నాయక్, రాజు, సంధ్య, హరికృష్ణ, భాషా నాయక్, రేణుక, అనుష, శారద, గిరి, సావిత్రి, రాణి, సైదులు, పాండు తదితర సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR