Qutbullapur: దూలపల్లి పారిశ్రామిక వాడలో భారీ చోరీ.. రూ.18 లక్షల రాగి క్యూబ్స్ మాయం!

Qutbullapur: కుత్బుల్లాపూర్ దూలపల్లి పారిశ్రామిక వాడలోని ఒక కంపెనీలో రూ. 18 లక్షల విలువైన 779 కిలోల రాగి క్యూబ్స్ చోరీకి గురయ్యాయి.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 17 Oct 2026 7:01 AM IST
Qutbullapur
X

Qutbullapur: దూలపల్లి పారిశ్రామిక వాడలో భారీ చోరీ.. రూ.18 లక్షల రాగి క్యూబ్స్ మాయం!

Qutbullapur: దూలపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని పావని పవర్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు కంపెనీలోకి ప్రవేశించి 779 కిలోల రాగి క్యూబ్స్‌ను అపహరించారు. వీటి బహిరంగ మార్కెట్‌ విలువ సుమారు రూ.18 లక్షలు ఉంటుందని అంచనా.

కంపెనీ ఎండీ గురువారం రాత్రి విధులు ముగిసిన అనంతరం కంపెనీకి తాళం వేసి సిబ్బందితో కలిసి ఇళ్లకు వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు కంపెనీని తెరిచి చూడగా రాగి క్యూబ్స్‌ కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించిన యాజమాన్యం ఆందోళనకు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళ కంపెనీలోకి చొరబడి ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఘటనపై కంపెనీ యాజమాన్యం శుక్రవారం పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కంపెనీ పరిసర ప్రాంతాల్లోని పరిస్థితులను పరిశీలిస్తూ, చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR