Hyderabad: జోన్-3 ఆర్కిటెక్చర్ అవార్డుల పోటీలు: 73 కళాశాలల భాగస్వామ్యం

Hyderabad: హైదరాబాద్‌లోని ఐసీఎఫ్ఏఐ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వేదికగా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అవార్డ్స్–2026 జోన్–3 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 11 Aug 2026 6:42 PM IST
Hyderabad
X

Hyderabad: జోన్-3 ఆర్కిటెక్చర్ అవార్డుల పోటీలు: 73 కళాశాలల భాగస్వామ్యం

హైదరాబాద్: ఐసీఎఫ్ఏఐ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హైదరాబాద్ వేదికగా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అవార్డ్స్–2026 జోన్–3 కార్యక్రమం నేడు ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన 73 ఆర్కిటెక్చర్ కళాశాలల నుంచి 157 ఫైనల్ ఇయర్ బి.ఆర్క్ థీసిస్ ఎంట్రీలు ఈ అవార్డుల కోసం పోటీ పడుతున్నాయి. ఈ కార్యక్రమంలో 2,000 మందికి పైగా బడింగ్ ఆర్కిటెక్ట్స్, 300 మందికి పైగా ఫ్యాకల్టీ, ఆర్కిటెక్ట్స్ పాల్గొంటున్నారు.

ఈ అవార్డులను భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అందిస్తోంది. కార్యక్రమంలో భాగంగా ఆర్కిటెక్చరల్ థీసిస్ ఎక్సలెన్స్ (AEAT), JK AYA – బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఆర్కిటెక్చరల్ హెరిటేజ్ డాక్యుమెంటేషన్ (DAH) తదితర విభాగాల్లో అవార్డులు ప్రదానం చేయనున్నారు.

ఈరోజు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి Zetatek Technologies ప్రతినిధి శ్రీ ఆర్. రవి కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివంగత వ్యవస్థాపకులు ఎన్.జె. యశ్వస్య సతీమణి శ్రీమతి శోభారాణి గౌరవ అతిథిగా పాల్గొన్నారు.

అలాగే వైస్ ఛాన్సలర్ డా. వినయ్ కుమార్, రిజిస్ట్రార్ డా. విజయలక్ష్మి తదితరులు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.

ఈ అవార్డులు యువ ఆర్కిటెక్ట్‌లలో సృజనాత్మకత, పరిశోధన, ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు భారతీయ నిర్మాణ కళ, వారసత్వ పరిరక్షణకు మరింత ప్రాధాన్యత కల్పించనున్నాయని నిర్వాహకులు తెలిపారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story