Hyderabad: కంట్రీ క్లబ్‌లో ‘యోగా డే’ వేడుకలు.. మెరిసిన టాలీవుడ్ భామలు!
Hyderabad: బేగంపేట కంట్రీ క్లబ్‌లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది.
Hyderabad: కంట్రీ క్లబ్‌లో ‘యోగా డే’ వేడుకలు.. మెరిసిన టాలీవుడ్ భామలు!
హైదరాబాద్: బేగంపేటలోని కంట్రీ క్లబ్ హైదరాబాద్ వేదికగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ యోగా సెషన్స్ ను సంస్థ చైర్మన్ వై. రాజీవ్ రెడ్డి ప్రారంభించగా, టాలీవుడ్ నటులు వేద్విక సోని, డాలీషాలు అతిథులుగా హాజరై వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇదే వేదికగా రాజీవ్ రెడ్డి, వేద్విక సోని, డాలీషా కలిసితో కలిసి ‘కంట్రీ క్యాటరర్స్’ సేవలను అధికారికంగా కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా యోగా కార్యక్రమాన్ని ప్రముఖ సెలబ్రెటీ టెలివిజన్ యాంకర్, మోటివేషనల్ స్పీకర్ అనుకృతి శర్మ కొన్ని యోగా ఆసనాలను ప్రదర్శిస్తూ ప్రత్యక్ష సెషన్‌ను నిర్వహించింది. ముఖ్యంగా హఠ యోగా, ప్రాణాయామాలు, యోగా నిద్ర, సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలతో ఔత్సాహికులకు శిక్షణ అందించింది.
ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.., దేశవ్యాప్తంగా యోగా నిర్వహణ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగా , ఆరోగ్య పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించాలనే దృక్పథానికి కంట్రీ క్లబ్ మద్దతు తెలుపుతోందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సమన్వయ యోగా కార్యక్రమాల్లో కంట్రీ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు.
కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్లప్పుడూ., ఆరోగ్యకరమైన జీవితం కోసం సంప్రదాయ తత్వశాస్త్రం మూలాలను గౌరవిస్తూ ఆరోగ్యానికి-ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కంట్రీ క్యాటరర్స్ ను దేశ వ్యాప్తంగా ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు.
నటులు డాలీషా, వేద్వికలు తన అభిప్రాయాలను పంచుకుంటూ...ప్రస్తుతం ప్రపంచదేశాలు సైతం భారత్ వైపు చూస్తున్నాయంటే ఇందులో యోగా కూడా ఒక కారణమేనని అన్నారు. యూఎస్ వంటి అగ్రదేశాల్లో యోగా భాగమైందని, అధునాతన ఫిట్నెస్ వ్యాయామాలకు బదులుగా వివిధ దేశాల్లో యోగాను అనుసరిస్తున్నారని వారు పేర్కొన్నారు.




