Medipally: న్యూసెన్స్ సృష్టించిన ఐదుగురికి స్వచ్ఛభారత్ పనులకు కోర్టు ఆదేశం!

Medipally: మేడిపల్లి పర్వతాపూర్‌లో ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా న్యూసెన్స్ సృష్టించిన ఐదుగురికి గంటసేపు స్వచ్ఛభారత్ పనులు చేయాలని కోర్టు ఆదేశించింది.

KARUNAKAR, UPPAL
Published on: 24 Nov 2026 4:13 PM IST
Medipally
X

Medipally: న్యూసెన్స్ సృష్టించిన ఐదుగురికి స్వచ్ఛభారత్ పనులకు కోర్టు ఆదేశం!

Medipally: పగటి వేళల్లో వేషధారణతో తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా న్యూసెన్స్ సృష్టించిన ఐదుగురికి కోర్టు స్వచ్ఛభారత్ పనులు చేయాలని ఆదేశించింది. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పర్వతాపూర్‌లో ఈ నెల 21న ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా న్యూసెన్స్ సృష్టించిన ఐదుగురిని పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనకు సంబంధించి మహేష్ (37), రమేష్ (43), శ్రీనివాస్ (33), శ్రీశైలం (26), చంద్రయ్య (26)లపై మేడిపల్లి పోలీసులు పెట్టీ కేసు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. కేసును పరిశీలించిన గౌరవ న్యాయమూర్తి, వారికి గంటసేపు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని ఆదేశించారు.

ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించకుండా బాధ్యతాయుతంగా ఉండాలని ఈ చర్య ద్వారా సూచించినట్లయింది. ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని, మళ్లీ ఇటువంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మేడిపల్లి పోలీస్ ఇన్‌స్పెక్టర్ జెలందర్ రెడ్డి హెచ్చరించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL