LB Nagar: జూలై 18న చెక్కు బౌన్స్ కేసుల పరిష్కారానికి సువర్ణావకాశం!
LB Nagar: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ కోర్టు ప్రాంగణంలో జూలై 18, 2026న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నారు
LB Nagar: జూలై 18న చెక్కు బౌన్స్ కేసుల పరిష్కారానికి సువర్ణావకాశం!
ఎల్బీనగర్: భారత సుప్రీంకోర్టు మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు 2026 జూలై 18వ తేదీన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎ. కర్ణ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం, 1881లోని సెక్షన్ 138 కింద నమోదైన చెక్కు బౌన్స్ కేసులను ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌లో పరస్పర రాజీ ద్వారా పరిష్కరించనున్నట్లు తెలిపారు. కక్షిదారులు, వారి న్యాయవాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లోక్ అదాలత్‌లో పాల్గొని తమ కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయం, ధనం ఆదా కావడంతో పాటు ఇరు పక్షాల మధ్య వివాదాలు శాశ్వతంగా ముగిసే అవకాశం ఉంటుందని తెలిపారు.
అందువల్ల పెండింగ్‌లో ఉన్న చెక్కు బౌన్స్ కేసుల కక్షిదారులు సంబంధిత కోర్టులను లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌లో రాజీ ద్వారా తమ కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.




