Cherlapally: కార్మిక హక్కుల సాధనకై ఐక్య పోరాటం చేద్దాం!
Cherlapally: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లు కార్మికులకు నష్టం కలిగిస్తున్నాయని సీపీఐ నేత వి.ఎస్. బోస్ విమర్శించారు.
Cherlapally: కార్మిక హక్కుల సాధనకై ఐక్య పోరాటం చేద్దాం!
Cherlapally: కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడులను రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఎస్ బోస్ అన్నారు.మేడే ను పురస్కరించుకొని చర్లపల్లి డివిజన్ పరిధిలోని పెద్ద చర్లపల్లి చౌరస్తాలో మేడే పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వి ఎస్ బోస్ మాట్లాడుతూ కార్మికుల ఐక్యతే వారి బలమని, హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల సాధన కోసం జరిగిన పోరాటాలకు మేడే ప్రతీకగా నిలిచింద న్నారు. కార్మికుల కష్టానికి తగిన గౌరవం ఇవ్వాలని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు కట్టుబడి పనిచేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కోడ్లు కార్మికుల హక్కులను హరించే విధంగా ఉన్నాయని, ముఖ్యంగా ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రత అంశాల్లో కార్మికులకు నష్టం కలిగించే ప్రమాదం ఉందని విమర్శిం చారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు సూరిబాబు గడ్డం కృష్ణ ఎఐటియుసి నాయకులు పోచయ్య గౌడ్ అశోక్ టి యాదగిరి బి రాజు, వలస కార్మికులు తదితరులు పాల్గొన్నారు.




