Jawahar Nagar: వైన్ షాపుల ముందు ట్రాఫిక్ కష్టాలు: పోలీసులకు ఫిర్యాదు చేసిన సీపీఐ నాయకులు

Jawahar Nagar: జవహర్‌నగర్ బాలాజీ వైన్స్ ఎదుట రోడ్డుపై వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని సీపీఐ నేత తోటపల్లి శంకర్ సీఐకి ఫిర్యాదు చేశారు. యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

PURENDAR, ALWAL
Published on: 7 May 2026 9:04 PM IST
Jawahar Nagar
X

 Jawahar Nagar: వైన్ షాపుల ముందు ట్రాఫిక్ కష్టాలు: పోలీసులకు ఫిర్యాదు చేసిన సీపీఐ నాయకులు

జవహర్‌నగర్: వైన్ షాపుల ముందు ఇష్టారాజ్యాంగ రోడ్లపైనే పార్కింగ్ చేయడం వల్ల, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని సిపిఐ జిల్లా నాయకులు తోటపల్లి శంకర్ అన్నారు. జవహర్ నగర్ పరిధిలోని బాలాజీ వైన్స్, లిక్కర్ మార్ట్ ఎదుట ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ.) ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గురువారం జవహర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సి.ఐ.శివ శంకర్ కు తగు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైన్ షాప్ ఓనర్లు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయకపోవడంతో, వైన్ షాపులకు వచ్చే వారు తమ వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపైనే నిలుపుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు.

ట్రాఫిక్ జామ్ అయ్యి అటుగా వెళ్లే బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా పాదచారులు నడవడానికి కూడా వీలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్దిష్ట ప్రాంతాల్లో వైన్ షాపుల యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని, వెంటనే వైన్ షాపుల యాజమాన్యాలు పార్కింగ్ సౌకర్యం కల్పించాలాని, రోడ్లను ఆక్రమించడం చట్టవిరుద్ధమని, తక్షణమే పోలీసులు స్పందించి సదరు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఐ. కాప్రా మండల కార్యదర్శి దర్శనం యాదగిరి, వి. స్వరూప నాయక్, కొండా సత్యం సాగర్, అంబాల ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL

Next Story