Hyderabad: మక్ధూమ్ భవన్‌లో తెలంగాణ అవతరణ వేడుకలు
Hyderabad: మక్ధూమ్ భవన్‌లో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు.
Hyderabad: మక్ధూమ్ భవన్‌లో తెలంగాణ అవతరణ వేడుకలు
హైదరాబాద్: హిమాయత్ నగర్ లోని మక్ధూమ్ భవన్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హాజరై జాతీయ జెండాను ఎగురవేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి , ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి , ఇతర నాయకులతో కలిసి జాతీయ గీతం , తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించిన కూనంనేని కూనంనేని సాంబశివరావు పాయింట్స్.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కమ్యూనిస్టుల త్యాగాలు మారువలేనివి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు కమ్యూనిస్టులు ముందు వరుసలో పోరాటాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం మొదట సంతకం చేసింది సిపిఐ నాయకులే అలాంటి కమ్యూనిస్టుల పోరాటాలను చరిత్రలో లేకుండా కుట్రలు చేశారు.
ఏ ఆకాంక్షల కోసం అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో , నేడు అవి అమలు కావడం లేదు గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్బందాలు , ఆంక్షలు , అక్రమ అరెస్టులు జరిగాయి. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత స్వేచ్ఛ ఇన్నప్పటికి పూర్తిస్థాయిలో ఉద్యమ ఆకాంక్షలు అమలు కావడం లేదు ఇప్పటి పరిస్థితుల కంటే ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండేవి అనే భావన కలుగుతుంది.
పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వాల్సింది
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సిందని కూనంనేని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఇష్యూలో జనసేన నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దాని వల్ల ప్రాంతీయ విభేదాలు తలెత్తే అవకాశాలు ఏర్పడ్డాయి ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని , తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వలేదని అనుకుంటున్న కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడే హక్కు ఉంటుంది.
రేపు తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీ లో ఏదైనా సభ పెడితే , అక్కడ కూడా అనుమతి ఇవ్వకపోవచ్చు ఈ పద్ధతి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు.




