Hyderabad: చిక్కడపల్లిలో ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతోంది: సీపీఐ నేత నారాయణ
Hyderabad: చిక్కడపల్లిలో ఓట్ల తొలగింపుపై సీపీఐ నేత నారాయణ వీడియో విడుదల. బతికున్న ఓటర్ల పేర్లు తొలగించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపాటు.
Hyderabad: చిక్కడపల్లిలో ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతోంది: సీపీఐ నేత నారాయణ
Hyderabad: చిక్కడపల్లిలో ఓట్ల తొలగింపు జరిగిందంటూ ఆరోపిస్తూ వీడియో విడుదల చేసిన సీపీఐ సీనియర్ నేత నారాయణ సీపీఐ నారాయణ కామెంట్స్బీ జేపీ కార్యకర్తలే ఎంపిక చేసుకుని ఓట్ల తొలగింపునకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
బూత్ స్థాయి నిర్మాణాన్ని బలోపేతం చేయాలన్న అమిత్ షా పిలుపును ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు అమలు చేస్తున్నారు ఇలాంటి చర్యల వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది ఓట్లు రద్దయ్యాయి బతికున్న ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం ప్రజాస్వామ్య హక్కులను దెబ్బతీయడమే...
కోట్లాది మంది ఓటర్ల ఓటు హక్కును ప్రభావితం చేసే చర్యలకు బాధ్యులైన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై హత్యా నేరం సహా వర్తించే చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని డిమాండ్....




