Vikarabad: వికారాబాద్‌లో సీపీఐ(ఎం) ధర్నా.. రోడ్లు వేయకపోతే నిరాహార దీక్షలు
Vikarabad: వికారాబాద్ జిల్లాలో గుంతల రోడ్లపై సీపీఎం నిరసన. ఈనెల 5 నుండి బీజేఆర్ చౌరస్తాలో నిరాహార దీక్షలు చేస్తామని ఆర్. మహిపాల్ హెచ్చరిక.
Vikarabad: వికారాబాద్‌లో సీపీఐ(ఎం) ధర్నా.. రోడ్లు వేయకపోతే నిరాహార దీక్షలు
వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలో, జిల్లాలోని 20 మండలాలలో రోడ్లు బాగు చేయాలని నేడు బాబు జగ్జీవన్ చౌరస్తాలో గుంతల మయమైన రోడ్ల వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ గోపాల్ రెడ్డి లు మాట్లాడుతూ
జిల్లాలో రోడ్లు అద్వానంగా ఉన్నవి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ జిల్లా కేంద్రంలో కానీ జిల్లాలో 20 మండలాలలో రోడ్లు ఎక్కడికి అక్కడ గుంతల మయం అయినాయి అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు అదే రోడ్లపై ఏసీలలో కారులలో పోతా ఉన్నారు తప్ప ప్రజలు పడుతున్న ప్రయాణికులు పడుతున్న కష్టాలు ఎమ్మెల్యేలకు స్పీకర్‌కు ముఖ్యమంత్రికి కళ్ళు కనబడటం లేదు తక్షణమే ఈ పాలకులు మీ మత్తు పరిపాలన వదిలి ప్రజలకు ఇచ్చిన హామీలు రోడ్లు బాగు చేయాలి.
నాయకులు అధికారులు ఇదే రోడ్లమీద తిరుగుతున్నారు తప్ప రోడ్లు బాగా చేయడం లేదు. పనులు చెయ్యని ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి ఆర్ అండ్ బి అధికారులు తక్షణమే రాజీనామా చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జిల్లా కమిటీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల బాధలు చూడకుండా ప్రజలను మరిచి కాంట్రాక్టర్స్ వ్యాపారవేత్తల కోసం పనిచేస్తున్న ఈ పరిపాలన వదిలి ప్రజాపలన వైపు పయనించాలని సిపిఎం గా కోరుతున్నాం వికారాబాద్ జిల్లాలో జిల్లా కేంద్రంలో రోడ్లు బాగు చేయనిచో *ఈనెల 5తేదీన నుండి BJR చౌరస్తాలో నిరాహార దీక్షలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సుదర్శన్ సత్యనారాయణ గోపాల్ రెడ్డి మత్స్య కార్మిక సంఘం జిల్లా నాయకులు జంగయ్య సంఘం జిల్లా నాయకులు శ్రీను నాయక్ కెవిపిఎస్ రైతు సంఘం నాయకులు వెంకట్ రాములు గౌస్ హరికృష్ణ వెంకటేష్ బాలరాజు యాదయ్య దశరథ్ చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.




