Hyderabad: సిపిఎం తెలంగాణ రాష్ట్ర యువజన సమ్మేళనాన్ని జయప్రదం చేయండి
Hyderabad: హైదరాబాద్ కొత్తపేటలో జూన్ 16, 17 తేదీల్లో నిర్వహించనున్న సిపిఎం తెలంగాణ రాష్ట్ర యువజన సమ్మేళనం పోస్టర్లను తుర్కయంజాల్ రాగన్నగూడలో విడుదల చేశారు.
Hyderabad: సిపిఎం తెలంగాణ రాష్ట్ర యువజన సమ్మేళనాన్ని జయప్రదం చేయండి
Hyderabad: ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా పనిచేస్తూ సమ సమాజ నిర్మాణం కోసం, శ్రామిక ప్రజల విముక్తి కోసం, కష్టజీవుల హక్కుల కోసం పోరాడుతున్న సిపిఐ(ఎం) పార్టీ, తెలంగాణ రాష్ట్ర యువ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు 2026 జూన్ 16, 17వ తేదీల్లో కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రావు భవన్ లో జరుగుతున్న సందర్భంగా ఈ రోజు సిపిఐ(ఎం) పార్టీ తుర్కయంజాల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో రాగన్నగూడలోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు "వాల్ పోస్టర్స్" విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు డి కిషన్, DYFI యువజన సంఘం జిల్లా కార్యదర్శి పి జగన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి, వారి ఆశలను ఆకాంక్షలను నీరుగార్చారని అన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. మరోవైపున కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు పన్నులను 33% శాతం నుండి 25 శాతానికి తగ్గించి దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతుందని మండిపడ్డారు.
నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా కోటి ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేశాయని అన్నారు ప్రజాస్వామిక పద్ధతుల్లో రాజకీయాలు చేస్తున్న బిజెపి మతాల మధ్య కులాల మధ్యన చిచ్చు రాజేస్తూ మనుషుల మధ్యన తగాదాలు రేపుతున్నదని తన రాజకీయ లబ్ధి కోసం అల్లర్లు సృష్టిస్తున్నదని అన్నారు.
నిరంకుశ పాలన అంతం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం యువత నడుం బిగించాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ నేపథ్యంలో జరగబోయే సిపిఎం యువజన సమ్మేళనానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని ఈ సమావేశాల్లో యువత పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ సభ్యులు ఎం.సత్యనారాయణ, కే.వెంకటకృష్ణ, పి.శ్రీనివాసులు నాయకులు ఐ కృష్ణ, ఏ.మాధవరెడ్డి, కే సత్యం, జి.సాయి శివ కె.జంగయ్య, కె.అఖిల్, శంకర్, గౌతం తదితరులు పాల్గొన్నారు.




