Hyderabad: సీపీఎం జాన్ వెస్లీ: విద్యుత్ ఛార్జీలు పెంచొద్దు!
Hyderabad: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ: వినియోగదారులపై రూ.7,635 కోట్ల ట్రూ-అప్ ఛార్జీల భారం మోపడం తప్పు. వెంటనే వీటిని ఉపసంహరించుకోవాలి.
Hyderabad: సీపీఎం జాన్ వెస్లీ: విద్యుత్ ఛార్జీలు పెంచొద్దు!
Hyderabad: విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకించిన సీపీఎం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వినియోగదారులపై రూ.7,635 కోట్ల ట్రూ-అప్ చార్జీల భారం మోపడం సరికాదని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండిస్తోంది. 2026 నవంబర్ నుంచి యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి 50 పైసలు పెంచే ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలి
ఈ విద్యుత్ చార్జీల పెంపు సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతుంది విద్యుత్ సంస్థల అసమర్థ నిర్వహణ భారాన్ని ప్రజలపై వేయడం అన్యాయం ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
ప్రభుత్వ శాఖల నుంచి డిస్కమ్‌లకు రావాల్సిన వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం రాబట్టడంలో విఫలమైంది ఒక్క నీటిపారుదల శాఖ నుంచే ఎత్తిపోతల పథకాల బకాయిలు రూ.29 వేల కోట్లకు పైగా ఉన్నాయి ప్రభుత్వ బకాయిలను వసూలు చేయకుండా ఆ భారాన్ని విద్యుత్ వినియోగదారులపై మోపడం ఎంతవరకు సమంజసం
ట్రూ-అప్ చార్జీల వసూళ్లను, యూనిట్‌పై అదనపు పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి 2000లో జరిగిన చారిత్రాత్మక విద్యుత్ ఉద్యమం స్ఫూర్తితో ప్రజలతో కలిసి ఈ చార్జీల భారాన్ని తిప్పికొడతాం




