Pargi: ఖుదావన్‌పూర్‌లో ఘనంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం!

Pargi: వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఖుదావన్‌పూర్‌లో సర్పంచ్ మోడె యాదయ్య క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు.

WAZID, PARIGI
Published on: 19 Oct 2026 8:25 AM IST
Pargi
X

Pargi: ఖుదావన్‌పూర్‌లో ఘనంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం!

Pargi: వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఖుదావన్‌పూర్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్‌ను గ్రామ సర్పంచ్ మోడె యాదయ్య ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మోడె యాదయ్య మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడం ఎంతో అవసరమని అన్నారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐకమత్యం, పట్టుదలతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారని, వారికి సరైన ప్రోత్సాహం లభిస్తే ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.

గ్రామంలో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల యువతలో స్నేహభావం, ఐకమత్యం పెరుగుతాయని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఆడి విజయాలు సాధించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సింలు, వార్డు మెంబర్ యాదయ్య, వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI