Hyderabad: అత్తాపూర్‌లో కిడ్నాప్ కలకలం రంగంలోకి దిగి చేజ్ చేసిన పోలీసులు

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కలకలం రేపింది.

ANJAIAH, SHAMSHABAD
Published on: 20 May 2026 10:33 AM IST
Hyderabad
X

Hyderabad: అత్తాపూర్‌లో కిడ్నాప్ కలకలం రంగంలోకి దిగి చేజ్ చేసిన పోలీసులు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివారు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కలకలం. థార్ కారులో యువతిని బలవంతంగా ఎక్కించుకోని తీసుకోని వెళ్లిన నలుగురు యువకులు. డయల్100 నెంబర్ కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించిన స్ధానికులు. థార్ కారును చేజ్ చేసే ప్రయత్నం చేసిన పోలీసులు. అత్తాపూర్ నుండి ఆరాంఘర్ చౌరస్తా వరకు చేజ్ చేసిన పోలీసులు. పోలీసుల కళ్లు కప్పి పారిపోయన కిడ్నాపర్స్.

నెంబర్ ప్లేట్ లేని కారు కావడంతో వివరాలు స్వేకరించడం లో పోలీసుల విఫలం. PVNR ఎక్స్ ప్రేస్ వే 143 పిల్లర్ నెంబర్ వద్ద సీసి టివి ఫూటేజ్ ను పరిశీలించిన పోలీసులు. నెంబర్ లేని కారు కావడంతో వివరాలు సేకరించడం కష్టతరంగా మారిన పరిస్థితి. యువతి కిడ్నాప్ కు గురైందా? లేక వేరే కారణం ఎమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్న అత్తాపూర్ పోలీసులు. కిడ్నాప్ కు గురైన యువతి ఎవరన్నది తెలియని పరిస్థితి యువతి కిడ్నాప్ కు గురైనట్లు గా ఇప్పటి వరకు పోలీసులకు అందని ఫిర్యాదు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD

Next Story