Hyderabad: పాత ఇళ్లలోనూ సులువుగా లిఫ్టుల ఏర్పాటు క్యూబ్ ఎలివేటర్స్
Hyderabad: పాత గృహాల్లోనూ తక్కువ స్థలంలో లిఫ్టులను అమర్చుతున్న క్యూబ్ ఎలివేటర్స్. ఇటలీ సాంకేతికతతో వృద్ధులకు అద్భుత పరిష్కారం అంటున్న సంస్థ ఎండీ అవినాష్ శర్మ.
Hyderabad: పాత ఇళ్లలోనూ సులువుగా లిఫ్టుల ఏర్పాటు క్యూబ్ ఎలివేటర్స్
హైదరాబాద్: నానాటికి అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతిక విధానంతో పాత గృహాలలో సైతం సులువుగా లిఫ్ట్ లను అమర్చుతున్నట్లు క్యూబ్ ఎలివేటర్స్ సంస్థ ఎండి చల్లా వెంకట అవినాష్ శర్మ తెలిపారు.
ఎర్రమంజిల్ మెర్క్యూర్ హోటల్లో విలేకరుల సమావేశంలో ఇటలీకి చెందిన హైడ్రానిక్ లిఫ్ట్ సంస్థ ఎండి ఫెడరికో లామ తో కలిసి మాట్లాడారు. గతంలో పాత గృహాలకు లిఫ్టులు ఏర్పాటు చేయడం సాధ్యం కాదనే భావన ఉండేదని ప్రస్తుతం సులువుగా ఏర్పాటు చేయగలుగుతున్నట్లు చెప్పారు.
కొద్దిపాటి స్థలంలో ఆధునిక సాంకేతికత తో రూపొందించిన ఎలివేటర్స్ ను తమ సంస్థ సమకూర్చుతోందని చెప్పారు. వయోభారంతో బాధపడుతున్న వృద్ధులకు ఈ సాంకేతికత అద్భుత పరిష్కారమని అన్నారు.
Next Story




