Nagole: సీనియర్ సిటిజన్లకు సైబర్ నేరాలపై అవగాహన..సైబర్ క్రైమ్ డీసీపీ!
Nagole: హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్‌లో సైబర్ జాగరూకత దివస్ సందర్భంగా సీనియర్ సిటిజన్లకు సైబర్ క్రైమ్ డీసీపీ నాగలక్ష్మి అవగాహన కల్పించారు.
Nagole: సీనియర్ సిటిజన్లకు సైబర్ నేరాలపై అవగాహన..సైబర్ క్రైమ్ డీసీపీ!
నాగోల్: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్స్ డీసీపీ నాగలక్ష్మి సూచించారు. సైబర్ జాగరూకత దివస్ సందర్భంగా నాగోల్ పోలీస్ స్టేషన్‌లో సీనియర్ సిటిజన్లకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిజిటల్ అరెస్ట్ మోసాలు, పెట్టుబడుల పేరుతో మోసాలు, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో మోసాలు, ఓఎల్‌ఎక్స్ మోసాలు, ఆన్‌లైన్ షాపింగ్, కస్టమర్ కేర్ పేరుతో మోసాలు, రుణాల పేరుతో మోసాలు, మ్యాట్రిమోనియల్ మోసాలు తదితర సైబర్ నేరాలపై అధికారులు అవగాహన కల్పించారు. అలాగే ఓటీపీ, యూపీఐ మోసాలు, ఫిషింగ్, టిప్‌లైన్ కేసులు, ఆన్‌లైన్ భద్రత, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీనియర్ సిటిజన్లకు వివరించారు.
తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకులు నమ్మవద్దని.. బ్యాంకు ఖాతా, ఏటీఎం, క్రెడిట్ కార్డు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటి వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. ఇంటర్నెట్‌ను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ.. అనుమానాస్పద లావాదేవీలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. సైబర్ క్రైమ్స్ డీసీపీ నాగలక్ష్మి, ఏసీపీ శివశంకర్ గౌడ్, నాగోల్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ, ఎస్‌ఐలు పి. శివ నాగ ప్రసాద్, మమతారెడ్డి పాల్గొన్నారు.




