Ibrahimpatnam: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దు ఇబ్రహీంపట్నం సీఐ సూచనలు!

Ibrahimpatnam: సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్ రెడ్డి ప్రజలకు పలు కీలక సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు.

RAVI, IBRHAMIPATNAM
Published on: 13 Aug 2026 10:59 AM IST
Ibrahimpatnam
X

Ibrahimpatnam: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దు ఇబ్రహీంపట్నం సీఐ సూచనలు!

Ibrahimpatnam: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, వాట్సాప్ లింకులను నమ్మవద్దు.OTP, ATM PIN, CVV, UPI PIN, పాస్‌వర్డ్ వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ చెప్పవద్దు.

బ్యాంకు అధికారులు, పోలీసులు లేదా ప్రభుత్వ అధికారులు అని చెప్పినా ఫోన్‌లో డబ్బులు పంపవద్దు.“డిజిటల్ అరెస్ట్”, కేసు నమోదైంది, పార్సిల్‌లో అక్రమ వస్తువులు ఉన్నాయని బెదిరించే కాల్స్‌ను నమ్మవద్దు.

అత్యవసరంగా డబ్బులు పంపాలని ఒత్తిడి చేసే వారిపట్ల ప్రత్యేక జాగ్రత్త వహించాలి.సోషల్ మీడియాలో తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్టులు, అనుమానాస్పద లింకులను ఓపెన్ చేయవద్దు. ఆన్‌లైన్‌లో డబ్బు పంపే ముందు వ్యక్తి, ఖాతా వివరాలను ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలి.

మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే బ్యాంకుకు పోలీసుల దృష్టికి తీసుకురావాలి,ఆన్లైన్ మోసాలు. డిజిటల్ అరెస్టు సస్కామ్ లాపై.ఇబ్రహీంపట్నం, సిఐ మహేందర్ రెడ్డి సూచన.

RAVI, IBRHAMIPATNAM

RAVI, IBRHAMIPATNAM

Next Story