Hyderabad: క్రెడిట్ కార్డు అప్‌గ్రేడ్ పేరిట మోసం.. 8.52 లక్షలు లాస్!
Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ సైబర్ క్రైమ్ వెలుగుచూసింది.
Hyderabad: క్రెడిట్ కార్డు అప్‌గ్రేడ్ పేరిట మోసం.. 8.52 లక్షలు లాస్!
Hyderabad: ఎల్బీనగర్ వనస్థలిపురం హరిహరాపురం వాసి ఎం.మధుకర్ గౌడ్ (45) కు ఈనెల 13న ఓ వ్యక్తి వాట్సప్‌లో కాల్ చేశాడు. తాను RBL క్రెడిట్ కార్డు అధికారిని అని పరిచయం చేసుకున్నాడు. మధుకర్ వాడుతున్న క్రెడిట్ కార్డు నంబరు, CVV వివరాలు చెబితే కొత్త కార్డు ఇస్తామని నమ్మించాడు.
నిజమనుకుని వివరాలు చెప్పగా మరుసటిరోజు వరుసగా ఓటీపీలు వచ్చాయి. ఒక కార్డు నుంచి రూ.3,60,490, మరో కార్డు నుంచి రూ.40,168, ఇంకో కార్డు నుంచి రూ.4,51,986 డెబిట్ అయినట్లు సమాచారం వచ్చింది.
మొత్తం 3 క్రెడిట్ కార్డుల నుంచి కలిపి రూ.8,52,644 పోగొట్టుకున్నాడు. ఈ మేరకు మల్కాజిగిరి సైబర్ క్రైం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




