Hyderabad: చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలి!
Hyderabad: శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. సృజన.
Hyderabad: చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలి!
Hyderabad: మన చేనేతకళలను మనమే ప్రోత్సహించాలని, చేనేత వస్త్రాలు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా భాద్యతగా ధరించాలని సైబరాబాద్ మున్సిపల్ కమీషనర్ జి.సృజన అన్నారు. శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరుతో ఏర్పాటుచేసిన చేనేత వస్త్రప్రదర్శనను ఆమె ప్రారంభించారు.
దసరా, బతుకమ్మ, దీపావళితో పాటు పలు శుభకార్యాలకు అనువుగా ఇక్కడ చేనేత కళాకారుల చీరలు కొలువుదీరాయని, చేనేత కళాకారులకు మరింత ఆదరణ లభించాలని ఆకాంక్షించారు. సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా చేనేత వస్త్రకళలు నిలుస్తాయని, భారతీయ వస్త్రాలకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం ఉందన్నారు.
చేనేతకారులకు మరింత ప్రోత్సాహం అందించడానికి, వారి ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరాలనే సదుద్దేశంతో ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటుచేసిన నిర్వాహకులు శ్రీనివాసరావు, వినయ్‌కుమార్‌ల కృషిని అభినందించారు. వస్త్రప్రదర్శనలోని వస్త్రాలను తిలకించి చేనేతకారులను ప్రశంశించారు. ప్రముఖ నగరాలకు చెందిన చేనేతకారులు తమ ఉత్పత్తులైన సిల్క్, కాటన్, డిజైనరీ వస్త్రాలను సుమారుగా 80స్టాల్స్ ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల11వరకు ఈ ఎగ్జిబిషన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందన్నారు.




