Cyberabad: అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్!

Cyberabad: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) పరిధిలో 17 అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. 11 నిర్మాణాలకు యూసీ నోటీసులు జారీ చేశారు.

G. Rama Krishna, Hyderabad
Published on: 25 Aug 2026 11:24 PM IST
Cyberabad
X

Cyberabad: అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్!

సైబరాబాద్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో అనధికార నిర్మాణాల్లో ఉన్న భవనాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను ముమ్మరం చేసింది. సీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు ఈరోజు మూడు జోన్లలో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపట్టారు.

ఈ చర్యల్లో భాగంగా మొత్తం 17 అనధికార నిర్మాణాలను కూల్చివేశారు. ఇందులో సెరిలింగంపల్లి జోన్‌లో 7, కూకట్‌పల్లి జోన్‌లో 2, కుత్బుల్లాపూర్ జోన్‌లో 8 నిర్మాణాలు ఉన్నాయి. కూల్చివేత చర్యలతో పాటు, గుర్తించిన అనధికార నిర్మాణాలకు సంబంధించి 11 UC నోటీసులు జారీ చేశారు. అలాగే MyCURE, ప్రజావాణి వినతులు మరియు అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహించిన తనిఖీల ద్వారా మొత్తం 54 అనధికార నిర్మాణాలను గుర్తించారు.

అనధికార నిర్మాణాలను ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో అవసరమైన చర్యలు చేపట్టే విధంగా గుర్తింపు మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తున్నారు. అనధికార నిర్మాణాలపై ప్రతిరోజూ క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేపట్టి, వాటిని గుర్తించడం, నిబంధనల ప్రకారం సకాలంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత టౌన్ ప్లానింగ్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ ఆదేశించారు.

భవన నిర్మాణ నిబంధనల అమలును బలోపేతం చేయడంతో పాటు, ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ మూడు జోన్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను సీఎంసీ నిరంతరం పర్యవేక్షించనుంది.

G. Rama Krishna, Hyderabad

G. Rama Krishna, Hyderabad

Next Story