Cyberabad: సైబరాబాద్‌లో ఏడుగురు పోలీస్ అధికారుల పదవీ విరమణ!

Cyberabad: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో జూలై 31న పదవీ విరమణ పొందిన ఏడుగురు పోలీస్ అధికారులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సభ.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 31 July 2026 5:49 PM IST
Cyberabad
X

Cyberabad: సైబరాబాద్‌లో ఏడుగురు పోలీస్ అధికారుల పదవీ విరమణ!

సైబరాబాద్: పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఘనంగా వీడ్కోలు పలికిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో, 2026 జూలై 31వ తేదీన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో పదవీ విరమణ పొందిన ఏడుగురు (07) పోలీస్ అధికారులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.యం. రమేష్, ఐపీఎస్ గారు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన అధికారులు తమ సుదీర్ఘ సేవా కాలంలో ప్రజలకు, పోలీస్ శాఖకు అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా సేవ, నేర నియంత్రణతో పాటు శాఖ అభివృద్ధికి వారు చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. వారి సేవాభావానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని, తమ అనుభవాన్ని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు, సహచర అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని ఆత్మీయంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ (అడ్మిన్) శ్రీమతి టి. అన్నపూర్ణ, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ శ్రీ వై.వి.ఎస్. సుధీంద్ర, సైబర్ క్రైమ్ డీసీపీ శ్రీమతి కె. పుష్ప, డీసీపీ (కార్ హెడ్‌క్వార్టర్స్) శ్రీ పి. సంజీవ్, ఏడీసీపీ శ్రీ షమీర్, సీఏఓ (అకౌంట్స్) శ్రీ వెంకట్ రెడ్డి, ఏఓ (అడ్మిన్) శ్రీమతి వై.వి.ఎస్. జ్యోతిర్మణి, ఎస్టేట్ ఆఫీసర్ ఆర్‌ఐ హిమాకర్, కో-ఆపరేటివ్ సొసైటీ ఇన్‌చార్జి ఎస్‌ఐ శ్రీ జి. మల్లేశం తదితరులు పాల్గొని విరమణ పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

విరమణ పొందిన పోలీస్ అధికారుల వివరాలు

క్రమ సంఖ్య హోదా & జనరల్ నెం. అధికారి పేరు విధులు నిర్వహించిన స్థలం

1 ఎస్‌ఐ-581 ఆర్. కిషన్ సింగ్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్

2 ఎస్‌ఐ-1556 ఎల్. రాజేశ్వర్ షాద్‌నగర్ పోలీస్ స్టేషన్

3 ఆర్‌ఎస్‌ఐ-6752 మహమ్మద్ అబ్దుల్ ఖాదీర్ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్

4 ఆర్‌ఎస్‌ఐ-6753 మహమ్మద్ మక్సూద్ ఘౌరీ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్

5 ఆర్‌ఎస్‌ఐ-6756 మహమ్మద్ అబ్దుల్ జలీల్ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్

6 ఎస్‌ఐ-2226 మహమ్మద్ నూర్ ఉద్దీన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఆర్‌జీఐఏ

7 హెచ్‌సీ-2602 గెనుగుల రమేష్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story