Hyderabad: కవితపై దానం నాగేందర్ ఘాటు వ్యాఖ్యలు!

Hyderabad: తెలంగాణలో రాక్షస పాలన నడుస్తుందన్న కవిత వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే దానం నాగేందర్.

GIRI, CENTRAL ZONE
Published on: 28 April 2026 1:10 PM IST
Hyderabad
X

Hyderabad: కవితపై దానం నాగేందర్ ఘాటు వ్యాఖ్యలు!

Hyderabad: రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని ఇటీవల కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పధకాలను మోడీ , అమిత్ షా లు కాపీ కొడుతున్నారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వంపై కవిత అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వారి కుటుంబ గొడవల కారణంగానే కవిత కొత్త పార్టీ పెట్టిందన్నారు. కవిత సొంత తండ్రిని రోబోగా అభివర్ణించడం తగదని , తల్లిదండ్రులను గౌరవించుకోవలని దానం హితవు పలికారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ , సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు దానం అందజేశారు. మహిళల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రతి నియోజకవర్గానికి వెయ్యి కుట్టు మిషన్లను అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనున్నట్లు దానం తెలిపారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE

Next Story