Kukatpally: కూకట్‌పల్లి వై జంక్షన్‌ వద్ద ప్రమాదకరంగా కేబుల్‌ పోల్‌!

Kukatpally: కూకట్‌పల్లి వై జంక్షన్‌ వద్ద ఇంటర్నెట్ కేబుల్‌ పోల్ గాలిలో ప్రమాదకరంగా వేలాడుతోంది. అధికారులు వెంటనే స్పందించి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Maruthisagar, Kukatpally
Published on: 5 Sept 2026 1:35 PM IST
Kukatpally
X

Kukatpally: కూకట్‌పల్లి వై జంక్షన్‌ వద్ద ప్రమాదకరంగా కేబుల్‌ పోల్‌!

Kukatpally: కూకట్‌పల్లి వై జంక్షన్‌ వద్ద ఓ ఇంటర్నెట్‌ కేబుల్‌ పోల్‌ ప్రమాదకరంగా మారింది. నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై కేబుల్‌ పోల్‌ బేస్‌మెంట్‌ దెబ్బతినడంతో, ప్రస్తుతం ఓ కేబుల్‌ ఆధారంగా గాలిలో వేలాడుతున్న పరిస్థితి నెలకొంది. పోల్‌కు ఉన్న కేబుల్‌ తెగిపోతే రహదారిపై వాహనదారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రమాదం చోటుచేసుకుంటే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదకరంగా మారిన పోల్‌ను గుర్తించి, వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story