Kukatpally: ఆల్విన్ కాలనీ రోడ్డుపై ప్రమాదకరంగా వాటర్ పైప్‌లైన్ వాల్వ్!

Kukatpally: హైదరాబాద్ ఆల్విన్ కాలనీ చివరి బస్ స్టాప్ ప్రధాన రహదారిపై ఉన్న మంచినీటి పైపులైన్ వాల్వ్ వాహనదారులకు ప్రాణాంతకంగా మారింది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 7 Jun 2026 7:35 AM IST
Kukatpally
X

Kukatpally: ఆల్విన్ కాలనీ రోడ్డుపై ప్రమాదకరంగా వాటర్ పైప్‌లైన్ వాల్వ్!

కూకట్‌పల్లి: ఆల్విన్ కాలనీ చివరి బస్ స్టాప్ ప్రధాన రహదారిలో మలము వద్ద భారీ మంచినీటి పైపులైన్ వాల్వు రోడ్డుకంటే ఎత్తులో ఉండి ప్రమాదకరంగా మారింది.

సరఫరా సమయంలో వాల్వునుంచి తాగునీరు లీకవుతోంది. రోడ్డుకంటే దాదాపు పదంగుళాల ఎత్తులోని ఈ వాల్వుతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

దీనికి ఆసరాగా చేసుకుని ఇక్కడి దుకాణదారులు ఫుట్పాత్ను ఆక్రమించారు. రాత్రి సమయంలో చీకటిలో వాహనాలు వాల్వును ఢీకొంటుండడంతో రాడ్ విరిగిపోయి తాగునీటి సరఫరాలో ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి. అధికారులు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story